![]() |
![]() |

శివబాలాజీ, మధుమిత వీరిద్దరు ఇండస్ట్రీలో అందరికి సుపరిచితమే. సినిమాలలో , షోలలో కన్పిస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. అయితే బిగ్ బాస్ షో శివబాలజీకి ఎంత పేరు తెచ్చిందో అందరికి తెలిసిందే. మధుమిత.. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటుడు శివ బాలాజీని పెళ్లిచేసుకుంది.
మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002 లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తరువాత ఆమెను కుడైకుళ్ మళై అనే సినిమాతో పార్తిబన్ తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెకు తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లిష్ కారన్ అనే తమిళ సినిమాల్లో నటించింది.
కాగా మధుమిత, శివబాలాజీ కలిసి సొంతంగా 'శివమధు' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. అందులో కుకుంగ్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు మధు, శివబాలాజీ దంపతులు. 'మా ఆడబిడ్డ కోసం తనకిష్టమైన నేతి రొయ్యల వేపుడు' అనే వ్లాగ్ ని చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో శివబాలజీ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళింటికి రావడంతో స్పెషల్ గా నేతి రొయ్యల వేపుడు చేసిందంట మధుమిత. అయితే శివబాలజీ వాళ్ళ సిస్టర్ కి పాప ఉందంట. ఆ పాప పేరు చిక్కి. తనది మధుమితది ఒకేరోజు బర్త్ డే అంట. అందుకే తనంటే అందరికి ఫేవరెట్ అంట. వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వెరైటీలు చేస్తున్నట్టు మధుమిత చెప్పుకొచ్చింది. కాగా శివాబాలజీ, మధుమిత చేస్తున్న వ్లాగ్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి యూట్యూబ్ లో విశేషమైన స్పందన లభిస్తుంది.
![]() |
![]() |